Website TemplatesJoomla TemplatesWeb Hosting

కారెట్ పెసరట్టు (Carrot Pesarattu)

moondal-carrot dosa 

కావలసిన పదార్థాలు:
పెసలు---2 కప్స్
బియ్యం---1/2 కప్
కారెట్ తురుము--1/2 కప్
అల్లం---చిన్న ముక్క
పచ్చి మిర్చి---5
జీలకర్ర---1 స్పూన్
ఉప్పు---తగినంత

విధానము:
1.పెసలు,బియ్యము 4 గంటలు నాన పెట్టాలి.
2.అల్లం,పచ్చి మిర్చి తరిగి ఉంచుకోవాలి.
3.నానపెట్టిన పెసలు+బియ్యము, అల్లము, పచ్చి మిర్చి ,కొంచం నీరు వేసి, దోస పిండిలా రుబ్బు కోవాలి.
4.రుబ్బిన పిండి లో సరిపడా ఉప్పు, జీలకర్ర , కారెట్ తురుము వేసి  పిండి బాగా కలపాలి.
5.పెనం వేడి కి పెట్టి, వేడి అయ్యాక, తయారు చేసుకున్న పిండి ని  దోస లా వేసుకొని , దోస చుట్టూ 1/2 స్పూన్ నూనె వేసి, ఎర్ర గా కాల్చాలి.
ఎంతో రుచిగా ఉండే కారెట్ -పెసరట్టు రెడి. ఈ దోసా అల్లం పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.

చిట్కా: పెసరట్టు కర కర రావాలి అనుకుంటే, 1/2 గ్లాసు బియ్యం ఎక్కువ వేసుకోవాలి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh