పెసరట్టు (Pesarattu)
|
|
కావలసిన పదార్థాలు: పెసలు---2 కప్స్ |
విధానము:
1.పెసలు,బియ్యము 4 గంటలు నాన పెట్టాలి.
2.అల్లం,పచ్చి మిర్చి తరిగి ఉంచుకోవాలి.
3.నానపెట్టిన పెసలు+బియ్యము, అల్లము, పచ్చి మిర్చి ,కొంచం నీరు వేసి, దోస పిండిలా రుబ్బు కోవాలి.
4.రుబ్బిన పిండి లో సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి, పిండి బాగా కలపాలి.
5.పెనం వేడి కి పెట్టి, వేడి అయ్యాక, తయారు చేసుకున్న పిండి ని దోస లా వేసుకొని , దోస చుట్టూ 1/2 స్పూన్ నూనె వేసి, ఎర్ర గా కాల్చాలి.
ఎంతో రుచిగా ఉండే పెసరట్టు రెడి. ఈ దోసా అల్లం పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.
చిట్కా: పెసరట్టు కర కర రావాలి అనుకుంటే, 1/2 గ్లాసు బియ్యం ఎక్కువ వేసుకోవాలి.
