ఉప్మా పెసరట్టు (Upma Pesarattu)
|
|
కావలసిన పదార్థాలు: పెసలు---2 కప్స్ ఉప్మా రవ/ సూజి ---1 కప్ బియ్యం---1/2 కప్ అల్లం---చిన్న ముక్క పచ్చి మిర్చి---5 జీలకర్ర---1 స్పూన్ ఉప్పు---తగినంత కొత్తిమీర---1 రెమ్మ కరివేపాకు----5 లేక 6 ఆకులు |
ఉప్మా చేసే విధానము:
1.బానలి పెట్టి, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక తిరగమాత గింజలు వేసి, గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.
2.ఆవాలు చిట చిట అన్నాకా,చిన్నగా కట్ చేసిన అల్లం,పచ్చి మిర్చి వేసి, 2 కప్స్ నీళ్ళు వేసి,ఉప్పు, కొత్తిమీర,కరివేపాకు వేయాలి.
3.తరువాత బానలి పై మూత పెట్టి ,10 నిముషాలు ,అంటే బుడగలు వచ్చేదాక మర్లించాలి.
4.తరువాత మర్లే నీళ్ళలో వేయించిన ఉప్మారవ/ సూజి కొంచం కొంచం వేసి కలపాలి.ఉప్మా ఉంట కట్టకుండా కలపాలి.
5.తరువాత మూత పెట్టి, సుమారు 5 నిముషాలు నీళ్ళలో రవ అంతా ఉడికేంత వరకూ వేచి చూడాలి.
6.తరువాత మూత తీసి,ఉడికిన ఉప్మా ను ఉంటలు లేకుండా కిందకి పైకి కలపాలి.
6.తరువాత 2 నిముషాలు మూత పెట్టి, స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే ఎంతో రుచిగా వుండే వేడి వేడి ఉప్మా రెడి.
విధానము:
1.పెసలు,బియ్యము 4 గంటలు నాన పెట్టాలి.
2.అల్లం,పచ్చి మిర్చి తరిగి ఉంచుకోవాలి.
3.నానపెట్టిన పెసలు+బియ్యము, అల్లము, పచ్చి మిర్చి ,కొంచం నీరు వేసి, దోస పిండిలా రుబ్బు కోవాలి.
4.రుబ్బిన పిండి లో సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి, పిండి బాగా కలపాలి.
5.పెనం వేడి కి పెట్టి, వేడి అయ్యాక, తయారు చేసుకున్న పిండి ని దోస లా వేసుకొని , దోస చుట్టూ 1/2 స్పూన్ నూనె వేసి, ఎర్ర గా కాల్చాలి.
ఎర్రగా కాలిన పెసరట్టుపై, మధ్య లో ఉప్మా పెట్టి, పెసరట్టు ను మడచాలి

ఎంతో రుచిగా ఉండే ఉప్మా –పెసరట్టు రెడి. ఈ దోసా అల్లం పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.
