Website TemplatesJoomla TemplatesWeb Hosting

బియ్యప్పిండి రొట్టే( Rice Flour Roti )

rice flour roti 

కావలసిన పదార్థాలు:

బియ్యప్పిండి--- 1 గ్లాసు

ఉల్లిపాయలు--2

పచ్చి మిర్చి--2

జీలకర్ర--1 స్పూన్

అల్లం--చిన్న ముక్క

కరివేపాకు---2 రెమ్మలు

కొత్తిమీర---2 రెమ్మలు

ఉప్పు--తగినంత

ఇంగువ-- చిటికెడు

కారం---1/4 స్పూన్. 

విధానము:

1.ఉల్లిపాయలు,పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర ,కరివేపాకు అన్నీ చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

2.ఒక గిన్నె లో బియ్యప్పిండి, ఇంగువ, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, మిర్చి, అల్లం కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.

3.కలిపిన పిండిని ,తగినంత నీరు వేసుకొని గట్టిగా కలుపుకోవాలి.

4.పెనం పైన 1 స్పూన్ నూనె వేసి, చేతితో  రొట్టే లా తట్టి స్టవ్ పైన పెట్టాలి.


riceflour roti 1


5.తరువాత తట్టిన రొట్టె  పై,1 స్పూన్ నూనె వేసి మూత పెట్టాలి. 

6.రెండు వైపులా ఎర్రగా కాలినాక, ప్లేట్ లో తీసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే బియ్యప్పిండి రొట్టే రెడి.ఈ రొట్టే పొడిచట్ని/వేరుశనగ పొడి తో తింటే చాలా బాగుంటుంది.

riceflourroti with powder

 

గమనిక: ఇష్టమున్న వాళ్ళు, పిండి తడిపేటప్పుడు వెల్లుల్లి, కొబ్బెర కూడా వేసుకోవచ్చు.

బియ్యప్పిండి  రొట్టే పెనం చల్లగా అయ్యాక  తట్టి  స్టవ్ పైన పెట్టాలి. వేడి పెనం పైన రొట్టే  తట్టరాదు. 

.

 
Comments (5)
5 Wednesday, 07 September 2011 08:31
madhu
excellent
4 Sunday, 19 June 2011 17:03
Madhavi
thanks you suneeta garu...........thanks for nice tip
3 Wednesday, 15 June 2011 00:08
mee vantalu chala baguntayi.
nenu urad laddu chesanu chala baga vachayi.
meeru rice flour roti chepparu kada, vatini pennam meeda kakunda
plastic cover ni cut chesukoni vati meeda oka spoon oil vesi pennam meeda veste virigi pookunda vastayi.
thanq.
2 Friday, 16 April 2010 16:12
Madhavi
Thanks Paavani
1 Friday, 16 April 2010 13:34
Paavani
Biyyam roti bagundhi. Chala ruchi ga vundhi. Thanks.

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh