Website TemplatesJoomla TemplatesWeb Hosting

పెస్టో పాస్త Pesto Pasta

pasta

కావలసిన పదార్థాలు:

పాస్తా --2 కప్స్
పేస్టో సాస్---2 స్పూన్స్
కారెట్---1
పచ్చి బఠానీలు--1/2 కప్
ఉల్లిపాయ--1/2
నూనె---1/2 స్పూన్
ఉప్పు--తగినంత
మిరియాల పొడి--1/2 స్పూన్
చీస్--1/4 కప్

విధానము:

1.గిన్నె లో 6 లేక 8 కప్పుల నీళ్ళలో పాస్త వేసి మెత్తగా అయ్యేంత  వరకు ఉడకనివ్వాలి.

2.తరువాత  ఉడికన పాస్తాను చిల్లుల గిన్నె లో వేసి నీరంతా వాడ్చి పక్కన పెట్టుకోవాలి.

3.బానలి లో నూనె వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి.( పెస్టో సాస్ లో నూనె వుంటుంది  కాబట్టి ఉల్లిపాయలు వేయించడానికి నూనె ఎక్కువ వేసుకోరాదు)

4.తరువాత పెస్టో సాస్, కారెట్, పచ్చి బఠానీలు వేసి బాగా ఉడికించాలి.

5.తరువాత ఉడికించి, వాడ్చిన పాస్తా, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

6.తరువాత తయారైన పాస్తా పైన చీస్ వేసుకోవాలి.

pasta

ఎంతో రుచిగా ఉండే పెస్టో పాస్తా  రెడి.

గమనిక: పాస్తా లో మీకు నచ్చిన కూరలు బ్రోకోలి, మొక్కజొన్న, బీన్స్, మష్రూం..... మోదలగునవి వేసుకున్న బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh