పీస్ పరాట (Peas parata)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.పచ్చి బఠానీలు మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేయాలి.
2.తరువాత బానలి లో నూనె వేసి, పచ్చి బఠానీలు దోరగా వేయించి, గరం మసాల, ఉప్పు, కారం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
3.తరువాత మిశ్రమం చల్లగా అయ్యాక, చిన్న ఉంటలు చేసుకోవాలి.
4.ఒక గిన్నె లో గోధుమ పిండి ,కొద్దిగా నూనె, తగినంత ఉప్పు వేసి, తగినంత నీరు వేసి చపాతి పిండీలా కలుపుకోవాలి.
5.తరువాత గోధుమ పిండి, చిన్న ఉంటగా తీసుకొని, పూరీలా చేసుకొని, మధ్యలో తయారు చేసుకున్న పచ్చి బఠానీ మిశ్రమం పెట్టాలి.
6.తరువాత చపాతి పిండి తో మిశ్రమం అంతా కప్పుతూ ఒక బాల్ లా చుట్టాలి.
7.ఇలా చుట్టిన బాల్ ను చపాతి లా వత్తుకోవాలి.
8.వత్తేటప్పుడు,కొద్దిగ మైదా/గోధుమ పిండి వేసుకోని మిశ్రమం పక్కకు పోకుండా,జాగర్తగా వత్తుకోవాలి.
9.ఈ విధంగా వత్తిన పీస్ పరాటను పెనం మీద వేసి, కొద్దిగా నూనె వేసి,దోరగా కాల్చుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే పీస్ -పరాటా/పచ్చి బఠానీ పరాటా రెడి.

