సేమియా ఉప్మా (Semiyaa Upmaa)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.బానలి లో నెయ్యి వేసి సేమియా వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.
2.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి.
3.బానలి లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక, తిరగమాత గింజలు వేసి, వేగినాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, మిర్చి, వేసి ఉల్లిపాయలు ఎర్రాగ వేగేంత వరకు వేయించాలి.
4.తరువాత పసుపు, కొత్తిమీర కరివేపాకు వేయాలి.
5.తరువాత 4 కప్స్ నీళ్ళు వేసి బాగా మర్లించాలి.(1 కప్ సేమియాకు-2 కప్స్ నీళ్ళు వేయాలి)
6.తగిననత ఉప్పు కూడా వేయాలి.
7.తరువాత వేయించిన సేమియాను మర్లే నీళ్ళలో వేసి బాగా కలిపి 3 లేక 5 నిముషాలు మూత పెట్టాలి.
8.తరువాత మూత తీసి, సేమియా బాగా ఉడికినాక, మరొక 3 నిముషాలు మూత లేకుండా ఉడకనివ్వాలి.
9.తరువాత స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి. (సేమియా ఉప్మాలో కొద్దిగా నీరు ఉన్నా ,తినేటప్పటికి సేమియా నీరు పీల్చుకొని గట్టిపడుతుంది).
ఎంతో రుచిగా ఉండే సేమియా ఉప్మా రెడి.

