టమొటా బాత్/టమొటా ఉప్మా (Tomato Upma)
|
|
|
విధానము:
1.బానలి లో నెయ్యి వేసి , తిరగమాత గింజలు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి.
2.తిరగమాత వేగినాక, బొంబాయి రవ/ఉప్మా రవ వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3.టమోటాలను కట్ చేసి, గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4.ఉల్లిపాయలు,ఆలుగడ్డ,పచ్చిమిర్చి,అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి.
5.బానలి లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు ,ఆలుగడ్డ, అల్లం, మిర్చి, వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించాలి.
6.తరువాత పసుపు, కొత్తిమీర కరివేపాకు వేయాలి.
7.తరువాత గ్రైండ్ చేసిన టమోటో రసం కప్ తో కొలచివేయాలి.తరువాత అవసరమైంత నీళ్ళు వేసి.(టమోట రసం+నీళ్ళు కలిపి 4 కప్స్ నీళ్ళు ఉండాలి) బాగా మర్లించాలి.
8.తరువాత తగినంత ఉప్పు వేయాలి.
9.తరువాత వేయించిన రవను మర్లే నీళ్ళలో వేసి, ఉంటలు లేకుండా బాగా కలిపి 3 లేక 5 నిముషాలు మూత పెట్టాలి.
10.తరువాత మూత తీసి, ఉప్మా బాగా ఉడికినాక, మరొక 5 నిముషాలు మూత లేకుండా ఉడకనివ్వాలి.
11.తరువాత స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి. (ఉప్మాలో కొద్దిగా నీరు ఉన్నా ,తినేటప్పటికి రవ నీరును పీల్చుకొని గట్టిపడుతుంది).
ఎంతో రుచిగా ఉండే టమొటా బాత్/టమొటా ఉప్మా రెడి.
గమనిక:
1. టమొటా రసం కూడా నీరు వేసుకొనే కొలతతో సమానము. టమొటా రసం కొల్చకపోతే ,ఉప్మాలో నీరు ఎక్కువ అయ్యి,ఉప్మా పేస్ట్ లా తయారవుతుంది.
2.టమొటాలు గ్రైండ్ చేయడం ఇష్టం లేనివారు, టమొటాలను చిన్నగా తరిగి వేసుకోవచ్చు. అప్పుడు 1కప్ రవకు 11/2 కప్ నీరు వేసుకుంటే చాలు.
కావలసిన పదార్థాలు: