Website TemplatesJoomla TemplatesWeb Hosting

సేమియా-రవ ఉప్మా (Semiya-Rava Upma)

 

కావలసిన పదార్థాలు:

సేమియా---1 కప్స్
బొంబాయి రవ/ఉప్మారవ--1 కప్
ఉల్లిపాయ--1
అల్లం--చిన్న ముక్క
పచ్చి మిర్చి--3 లేక 5
నూనె--1 స్పూన్
నెయ్యి--1 స్పూన్
కరివేపాకు--1 రెమ్మ
కొత్తిమీర--2 రెమ్మలు 
పసుపు--1/2 స్పూన్
తిరగమాత--(అన్నీ 1/4 స్పూన్)
(శనగ పప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు)

విధానము:

1.బానలి లో నెయ్యి వేసి సేమియా ,బొంబాయి రవ వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.

2.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి.

3.బానలి లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక, తిరగమాత గింజలు వేసి, వేగినాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, మిర్చి, వేసి ఉల్లిపాయలు ఎర్రాగ  వేగేంత వరకు వేయించాలి.

4.తరువాత పసుపు, కొత్తిమీర కరివేపాకు వేయాలి.

5.తరువాత 4 కప్స్ నీళ్ళు వేసి బాగా మర్లించాలి.(1 కప్ సేమియాకు/రవకు-2 కప్స్ నీళ్ళు వేయాలి)

6.తగిననత ఉప్పు కూడా వేయాలి.

7.తరువాత వేయించిన  సేమియా+ ఉప్మా రవ మర్లే నీళ్ళలో వేసి బాగా కలిపి 3 లేక 5 నిముషాలు మూత పెట్టాలి.

8.తరువాత మూత తీసి, ఉప్మా బాగా ఉడికినాక, మరొక 3 నిముషాలు మూత లేకుండా ఉడకనివ్వాలి.

9.తరువాత స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి. (ఉప్మాలో కొద్దిగా నీరు ఉన్నా ,తినేటప్పటికి సేమియా నీరు పీల్చుకొని గట్టిపడుతుంది).

ఎంతో రుచిగా ఉండే సేమియా రవ ఉప్మా రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh