Website TemplatesJoomla TemplatesWeb Hosting

బొరుగుల/ ముర్మురాల ఉప్మా (Murmura Upma / Borugula Upma)

 

puffed rice upmaకావలసిన పదార్థాలు:

బొరుగులు/ముర్మురాలు---6 కప్స్
ఉల్లిపాయ--1
టమొటా--1
అల్లం--చిన్న ముక్క
పచ్చి మిర్చి--3 లేక 5
నూనె--1 స్పూన్
నెయ్యి--1 స్పూన్
కరివేపాకు--1 రెమ్మ
కొత్తిమీర--2 రెమ్మలు 
పసుపు--1/2 స్పూన్
పుట్నాల పప్పులు--1/4 కప్
తిరగమాత--(అన్నీ 1/4 స్పూన్)
(శనగపప్పు,ఉద్దిపప్పు,జీలకర్ర,ఆవాలు)

విధానము:

1.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి.

2.బానలి లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక, తిరగమాత గింజలు వేసి, వేగినాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, మిర్చి, వేసి ఉల్లిపాయలు ఎర్రాగ వేగేంత వరకు వేయించాలి.

3.తరువాత పసుపు, కొత్తిమీర కరివేపాకు వేయాలి.

4.తగిననత ఉప్పు కూడా వేయాలి.

5.బొరుగులు నీళ్ళలో కడిగి, నీరు లేకుండా గట్టిగా పిండి, పక్కన పెట్టుకోవాలి. 

6.తరువాత వేయించిన  ఉల్లిపాయ  మిశ్రమము లో గట్టిగా పిండి, పక్కన పెట్టుకున్న  బొరుగులను వేసి, బాగా కలిపి 3 నిముషాలు మూత పెట్టాలి.

7.తరువాత మూత తీసి, పుట్నాల పొడి వేసి బాగా కలపాలి.

8.తరువాత 2 నిముషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే బొరుగుల/ముర్మురాల ఉప్మా రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh