అటుకుల ఉప్మా (Rice flake Upma)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి.
2.బానలి లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక, తిరగమాత గింజలు వేసి, వేగినాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, మిర్చి, వేసి ఉల్లిపాయలు ఎర్రాగ వేగేంత వరకు వేయించాలి.
3.తరువాత పసుపు, కొత్తిమీర కరివేపాకు వేయాలి.
4.తగిననత ఉప్పు కూడా వేయాలి.
5.అటుకులు నీళ్ళలో కడిగి, నీరు లేకుండా గట్టిగా పిండి, పక్కన పెట్టుకోవాలి.
6.తరువాత వేయించిన ఉల్లిపాయ మిశ్రమము లో గట్టిగా పిండి, పక్కన పెట్టుకున్న అటుకులను వేసి బాగా కలిపి 3 నిముషాలు మూత పెట్టాలి.
7.తరువాత మూత తీసి ,పుట్నాల పొడి వేసి బాగా కలపాలి.
8.తరువాత 2 నిముషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా ఉండే అటుకుల ఉప్మా రెడి.

