సగ్గుబియ్యం ఉప్మా (Sabudana Upma)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.సగ్గుబియ్యం నీళ్ళలో 2 గంటలు నాన పెట్టుకోవాలి.
2.స్టవ్ మీద కొద్దిగా నీరుపెట్టి, నానపెట్టిన సగ్గు బియ్యం వేసి బుడగలు వచ్చేలా మర్లించాలి.(తెల్లగా ఉండే సగ్గుబియ్యం మీదా ఉండే రంగు పొయేలా మర్లించాలి)
3.తరువాత ఉడికించిన సగ్గు బియ్యం చిల్లుల గిన్నె లో వేసి, నీరు లేకుండా వాడ్చుకొని పక్కన పెట్టుకోవాలి.
4.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి.
5.బానలి లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక, తిరగమాత గింజలు వేసి, వేగినాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, మిర్చి, వేసి ఉల్లిపాయలు ఎర్రాగ వేగేంత వరకు వేయించాలి.
6.తరువాత పసుపు, కొత్తిమీర కరివేపాకు వేయాలి.
7.తగిననత ఉప్పు కూడా వేయాలి.
8.తరువాత వేయించిన ఉల్లిపాయ మిశ్రమము లో ఉడికించి, వాడ్చుకున్న సగ్గు బియ్యం వేసి బాగా కలిపి 3 నిముషాలు మూత పెట్టాలి.
9.తరువాత మూత తీసి,పుట్నాల పొడి వేసి బాగా కలపాలి.
10.తరువాత 2 నిముషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా ఉండే సగ్గు బియ్యం ఉప్మా రెడి.
