బటూర (Batura)
|
మైదా--2 కప్స్ పెరుగు--3/4 కప్ బొంబాయి రవ--1/4 కప్ బేకింగ్ సొడా--1/2 టీ స్పూన్ చెక్కర--1/2 స్పూన్ ఉప్పు – తగినంత నూనె---3 కప్స్ వేయించడానికి |
విధానము:
1.ఒక గిన్నె లో మైదా, బేకింగ్ సోడ, బొంబాయి రవ ,చెక్కర ,ఉప్పు ,పెరుగు వేసి బాగా కలపాలి.
2.తరువాత పాలు లేక నీరు వేసి పూరి పిండి లా కలపాలి.
3.తరువాత పిండి పై 3 లేక్ 4 స్పూన్స్ నూనె వేసి బాగా కలిపి మూత పెట్టి, 3 -4 గంటలు పక్కన పెట్టాలి.
4.తరువాత పిండి మెత్తగా అయ్యాక పూరీ లా సమానంగా వత్తి నూనె లో వేయించాలి.(బటూర అన్ని వైపులా సమానంగా వత్తాలి. లేకపొతే బటూర పొంగదు)
అంతే ఎంతో రుచిగా ఉండే బటూర రెడి. వీటిని చెన్న మసాల తో తింటే చాలా బాగుంటుంది.
కావలసిన పదార్థాలు: