పరాట(wheat Parata)
|
|
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి--2 కప్స్ పెరుగు--2 టేబుల్ స్పూన్స్ నూనె--4 స్పూన్స్ ఉప్పు--తగినంత |
విధానము:
1.ఒక గిన్నెలో గోధుమ పిండి,ఉప్పు,పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి.
2.తరువాత పిండి పై 2 స్పూన్స్ నూనె వేసి బాగా కలిపి మూత పెట్టి,30 నిముషాలు నాన పెట్టాలి.
3.తరువాత చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి.

4.చిన్నగా చేసుకున్న ఉంటను చపాతి పీటపై చపాతిలా వత్తాలి.

5.తరువాత చపాతి పై 1 స్పూన్ నెయ్యి/నూనె పూయాలి.

6.చపాతి చివరి లో వెడల్పుగా మడచాలి.
.jpg)
7.తరువాత చపాతి వెనక వైపు కొద్దిగా మడచాలి.
.jpg)
8.అంటే ఒక మడత కిందికి, ఒక మడత పైకి మడచాలి.ఇలా చపాతీని మడచాలి.

9.తరువాత మడిచిన చపాతీని గుండ్రంగా చుట్టాలి.


10.ఇలా చుట్టిన చపాతీని మరలా చపాతీ లా చేయాలి.

11.తరువాత పెనం వేడికి పెట్టాలి.
12.చపాతి వేడి పెనం పై వేయాలి.
.jpg)

13.తరువాత చపాతిపై చిన్న చిన్న బుడగలు వచ్చిన వెంటనే మరొక వైపు తిప్పాలి.

14.దానిపై 1 స్పూన్ నూనె పూయాలి.

15.తరువాత మరో వైపు తిప్పి కొద్దిగా నూనె/నెయ్యి రాసి 10 సెకనులు ఉంచి తీసేయాలి.

ఎంతో రుచిగా ఉండే పరాట రెడి. ఇది చోలే/ ఏదైన కూర తో తింటే చాలా బాగుంటుంది.

గమనిక: ఇదే రకంగా పరటాలు మైదా తో కూడా చేసుకోవచ్చు.

