రాగి రొట్టె(Ragi Roti)
|
|
కావలసిన పదార్థాలు:
రాగి పిండి--2 కప్స్ |
విధానము:
1.ఉల్లిపాయలు,పచ్చి మిర్చి పొడవుగా తరిగి పెట్టుకోవాలి.
2.ఒక గిన్నె లో రాగి పిండి వేసుకోవాలి.

3.తరువాత బియ్యప్పిండి వేసుకోవాలి.

4.దానిపై తగినంత ఉప్పు, ఇంగువ వేయాలి.

5.తరువాత జీలకర్ర వేసి బాగా కలపాలి.
.jpg)
6.నీళ్ళు వేడి చేసి, కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి కలపాలి.
.jpg)
7.పిండి జారుగా కాకుండా ముద్దగా కలపాలి.

8.తరువాత పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి.

9.పొడవుగా తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి.

10.ఇప్పుడు రాగి రొట్టెకు పిండి తయారైంది.

11.తరువాత పెనం పై కొద్దిగా నూనె వేసి రాగి పిండి ని కొద్దిగా తీసుకొని పెనం కు తట్టాలి.

12.రొట్టెపై కొద్దిగా నూనె వేసి మూత పెట్టి ఎర్ర గా కాల్చాలి.

13.తరువాత రెండవ వైపు కూడా తిప్పి ఎర్రగా కాల్చి ప్లేట్ లో తీసుకోవాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే రాగి రొట్టె రెడి.ఈ రొట్టె ఉల్లిపాయ పచ్చడి/ఎర్రకారంతో తింటే చాలా బాగుంటుంది.

గమనిక:ఈ రొట్టె కాల్చేటప్పుడు మూత తప్పకుండా పెట్టాలి.లేకపోతే రొట్టే ఎండి పోయినట్టు అవుతుంది.
